Sunday, August 2, 2009

Waiting For You .........

నిన్ను చూడాలని......
నీతో ఉండాలని.......
నీ ప్రియమైన పలకరింపులో..
నన్నేను మరచిపోవాలని..
నీ ఒడిలొ నిద్దురోవాలని.....
కవ్వింతలతో నిన్ను నవ్వించాలని......
ఊహలన్ని నీతో పంచుకొవాలని......
తనివితీర నీతో ఊసులడాలని.......
నువ్వు గెలవాలని....................
నీతో నేను ఒడాలని............
మనసు పొరల్లొ ఆ జ్ణాపకాల్ని నిషిప్తాం చేసుకోవాలని.....
నీ సమషంలో నా హ్రుదయాన్ని పరచి చూపాలని..........
ఎన్నెన్ని ఆశలు............
ఎల నివెదించను.....
నీకేల విన్నవించను....!!!!!!!!!!!
**********************************************************************************
నీ కోసమే నా అన్వేషణ
నీ కోసమే నా నీరిక్షణ
నీ చూసే క్షణం కోసం కొన్ని వేల సార్లు మరణించైనా సరే
ఒక సారి జన్మించటానికి సిద్దంగా ఉంటాను

**********************************************************************************
మరు జన్మకైన కరుణిస్తావ....
ఈ క్షణమే మరణిస్తాను
**********************************************************************************
నా కళ్లకు తెలుసు నీ కోసం ఎన్ని కలలు కన్నానో,కంటునానో
నా కాళ్లకు తెలుసు నీ కోసం ఎంత దూరం నడిచనో,నడుస్తునానో
నా వయస్సుకు తెలుసు నీ కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురుచూసానో,ఎదురుచూస్తునానో
ఒక్కసారి నువ్వు కనబడు,నిన్ను నా కళ్లలో దాచుకుంటాను
నా మనస్సులో గుడి కట్టి పూజిస్తా జీవితాంతం నీకు తోడుగా ఉంటా
**********************************************************************************
మరపు రాని తీపి గుర్తువి నీవు.
కరగి పొని కాంతివి నీవు
కమ్మని కవితకు అర్ధం నీవు
ఉండాలి కలకలం అనందంగా నీవు!

************************************************************************************ ఓ స్వాతి ముత్య సౌదమా నువ్వెవరు

ప్రకృతి కరుణించిన స్వాతి చినుకు అందానివా

వెన్నెలతో వన్నెలద్దుకున్న అమర శిల్ప రూపానివా

మనసంత మల్లెలు పరిచి మధు మాసాలు కురిపించే వసంతానివా

నీలి సంద్రాన పిల్ల వాయువుల వీచే పడమటి సంధ్యా రాగానివా

కలలో కనిపించి కనురెప్పలపై జాలువారే నువ్వెవరు...!

************************************************************************************

ఎవరివో ?నీ వెవరివో ?
వలపు వాకిట వందనవో ?

చిలిపి చూపుల చందనవో ?

అపూర్వ సుందర నందనవో ?

అధ్బుత ప్రేమభావనవో ?

నన్ను నిద్ర లేపే కమ్మని కలవో ?

నా మనస్సు దొచే కొచ్చటి ముక్కువో ?..
ప్రణయ పల్లకిలోనా భావ వల్లరివైనా కోసం ఒంటరిగానన్ను చేరిన తుంటరివో ? **********************************************************************************

ఆ సుందర సాగర తీరాన ..

ఆమె తోడుగ నడిచిన సమయాన ..

తలపుల తలుపులు తెరువంగా ..

నా అడుగులో అడుగే వేయంగా ..

నిండు చంద్రుని వెన్నెల వర్షం ..

భువిని తాకిన ఆ నిమిషం ..

నా తనువంతా ఏదిఅ పరవశం ..

మనసయ్యేను ఆమె వశం ..

మా ఇరువురి అడుగుల పయనం ..

సాగిపోవాలి మరో యుగం ..

************************************************************************************

నిదురించిన రెప్పలపై చేసావు ప్రేమ సంతకాలు ..

మూసి ఉన్నకనులకు చూపావు ఎన్నో అద్భుత కలలు ..

నిన్ను తలచిన ప్రతి నిమిశం ఏదో తెలియని ఉద్వేగం ..

రెక్కలు కట్టుకు వచ్చి నిన్నే చూడాలని ఆరాటం ..

కలలో అయినా వీడదు నీ దివ్య రూపం..

నీవు ఉంటే చాలు కనిపించదు లోకం ..

నీలి కన్నుల నింపావు ప్రేమ కడలి ..

కనిపించని మనసులోకి చొరబడి కదిలించావు ఈ హ్రుదయాన్ని ..

నీ చిరునవ్వే నా గుండెల సవ్వడి ..

నువ్వె నా ప్రాణం ..

************************************************************************************ సూరీడు వచ్చినా చీకటిగానే ఉంది ..

నీ చూపులు సోకకనేమో ..

చుట్టూ సందడిగా ఉన్న శూన్యంగా ఉంది ..

నీ సవ్వడి వినిపించకనేమో ..

అందరు నాతో ఉన్నా ఒంటరిగా అనిపిస్తోంది ..

నీ తోడు లేకనేమో ..

ఏ ప్రకృతి సౌందర్యం చూసిన నచ్చడంలేదు ..

నీ రూపం కనిపించకనేమో ..

5 comments:

Unknown said...

Asalu jananiki ardham avutundatava;-)

Unknown said...

intha chadhavadam kastam mama...lite theesko :P

Praveen said...

arey..ivi neeve rasava?????
danlto okkati..I think it is from Aarya movie :P

Neologism said...

Arey neeku emindi sudden ga.. love failure a... neeku suit kaadu mama.. ivvani

vininaag said...

chichaa

soooooooper vunnai kavitalu...
Kaani nuvvu rasinattu levu..

Avi Raayadam chaala kastam...
telugu font thoo ...

Idi kooda baane vuntundi...
Kaani pogidinattu kaadu ;)